22 August, 2026 | 5:04 AM

ఘనంగా వరలక్ష్మీ వ్రత పూజలు

22-08-2026 12:00 AM

నాగోల్, ఆగస్టు 21 (విజయ క్రాంతి): శ్రావణ శుక్రవారం సందర్భంగా కొత్తపేట లో బీజేపీ రంగారెడ్డి (అర్బన్) జిల్లా ఉపాధ్యక్షురాలు నందికొండ గీతారెడ్డి  నివాసంలో నిర్వహించిన వరలక్ష్మీ వ్రత పూజా కార్యక్రమంలో బద్దం సృజన ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం పూజకు హాజరైన మహిళలకు వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కుటుంబంలో సుఖసంతో షాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం నిర్వహించడం మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.