22 August, 2026 | 5:04 AM

బీజేపీ 48 గంటల ‘ఫీజు’దీక్ష

22-08-2026 02:07 AM

పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈనెల 24, 25 తేదీల్లో..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు నేతృత్వంలో నిరాహార దీక్ష

సంఘీభావంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): విద్యార్థులకు చెల్లించాల్సిన..పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీజేపీ పోరుకు సిద్ధమవుతో ంది. ఈ మేరకు 48 గంటలపాటు నిరాహార దీక్ష చేయపట్టనున్నట్లు రాష్ట్ర బీజేపీ కార్యాలయం వెల్లడించింది.

ఫీజు బకాయి బీజేపీ లడాయి నినాదంతో ఈ నెల 24, 25 తేదీల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు నేతృత్వంలో రాష్ట్ర కార్యాల యంలో 48 గంటల దీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్వయంగా ఈ దీక్ష చేపట్టనున్నారు. ఆయనకు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు సంఘీభావం ప్రకటించనున్నారు. వీరం తా దీక్షాశిబిరాన్ని సందర్శించి మద్దతు తెలుపనున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్‌పై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల నుంచి సంతకాలు సేకరించిన బీజేపీ త్వరలోనే వాటిని గవర్నర్‌కు అందజేయనుంది.