18 July, 2026 | 12:30 AM

అమ్మలగన్న అమ్మ.. శ్రీ పోచమ్మతల్లి దివ్య మంగళ స్వరూపం

18-07-2026 12:03 AM

శ్రీరామ్‌నగర్‌లో ఘనంగా రెండో రోజు వారాహి నవరాత్రి ఉత్సవాలు                       

జవహర్‌నగర్, జూలై 17 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ శ్రీరామ్ నగర్ కాలనీలో శ్రీ పోచమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని వారాహి నవరాత్రి వేడుకలు రెండవ రోజైన శుక్రవారం ఘనంగా జరిగాయి. ఉత్సవాల తొలి రోజున అమ్మవారు శ్రీ వారాహి దేవి అలంకరణతో భక్తులకు దివ్యంగా దర్శనం ఇవ్వగా రెండవ రోజైన శుక్రవారం వారాహి మాత రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది.

ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మునిగాల సతీష్ కుమార్ మాట్లాడుతూ ఉత్సవాలు అంగరంగ వైభవంగా  అమ్మవారు శ్రీ వారాహి దేవి అలంకరణలో భక్తులకు దివ్యదర్శనమిస్తున్నారని ఆ అమ్మవారి దయవల్ల జవహర్ నగర్ ప్రజలే కాక జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నట్టు తెలిపారు.ఈరోజు నుండి అమ్మవారు వారాహి దేవి అలంకరణలో దర్శనమిస్తున్నారని కావున భక్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి భక్తులు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు పసుపు కుంకుమలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ నగర్ పరిసర ప్రాంతాలు పండుగ శోభతో దేదీప్య మానవయ్యాయి.