18 July, 2026 | 12:31 AM

పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ

18-07-2026 12:04 AM

మేడ్చల్, జూలై 17 (విజయక్రాంతి): సఫిల్‌గూడలోని పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికా రి డాక్టర్ ఆనంద్ ఆకస్మికం గా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా  ఓపీ  రిజిస్టర్, ప్ర యోగశాల (ల్యాబ్) రిజిస్టర్లను పరిశీలించి నమోదులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం ఫార్మసీని తనిఖీ చేసి, మం దుల నిల్వలు, బఫర్ స్టాక్ పరిస్థితిని పరిశీలించారు.

ముఖ్యంగా గడువు సమీపిస్తున్న  మందులను గుర్తించి, వాటి వినియోగం మరియు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు. మాతా-శిశు ఆరోగ్య  సేవలను మరింత మెరుగుపరచాలని, గర్భిణీల నమోదు, ప్రసవానంతర సేవలు, శిశు టీకాల కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

అదేవిధంగా క్షయవ్యాధి  కేసులను గుర్తించడం, చికిత్సలో ఉన్న రోగులను నిరంతరం అనుసరించడం, వారికి అందజేయాల్సిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షయవ్యాధి నిర్మూలన లక్ష్య సాధనకు క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతమైన పర్యవేక్షణ నిర్వహించాలని తెలిపారు. ఈ తనిఖీలో ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.