18 July, 2026 | 12:30 AM

ఘట్ కేసర్‌లో ‘సర్’పై సమీక్ష

18-07-2026 12:03 AM

ఘట్ కేసర్, జూలై 17 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం డిప్యూటీ కమిషనర్ వాణి  అధ్యక్షతన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్ ) పై కీలక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా, లోపాలు లేకుండా సాగాలంటే అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు ఇందులో భాగస్వాములు కావాలని డిప్యూటీ కమిషనర్ వాణి కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, జాబితాలోని తప్పులను సరిదిద్దడం ఈ ప్రత్యేక డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశమని ఆమె వివరించారు.

బూత్ స్థాయి అధికారులు (బిఎల్‌ఓలు), రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమగ్రమైన ఓటరు జాబితా రూపకల్పన కోసం రాజకీయ పార్టీలు తమ పరిధిలోని కార్యకర్తలను అలర్ట్ చేసి, అర్హులైన ఓటర్ల నమోదుకు సహకరించాలని ఈ సందర్భంగా అధికారులు విజ్ఞప్తి చేశారు.