13 June, 2026 | 6:37 PM

గజ్వేల్‌లో ఘనంగా వంటేరు ప్రతాప్‌రెడ్డి జన్మదిన వేడుకలు

13-06-2026 05:38 PM

గజ్వేల్: బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వంటేరు  ప్రతాప్‌రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం గజ్వేల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ ఆధ్వర్యంలో పలు సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గజ్వేల్‌లోని అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి, గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించగా, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రతాప్‌రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. నల్లవాగు హనుమాన్ దేవాలయంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు  శ్రీనివాస్  ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతాప్‌రెడ్డి ఆయురారోగ్యాలతో, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ప్రార్థించారు.