మంచినీటి ఇబ్బందిని పరిష్కరిస్తున్న గ్రామ సర్పంచ్
13-06-2026 05:41 PM
మనోహరాబాద్,(విజయక్రాంతి): మనోహరాబాద్ మండలం రామాయపల్లి గ్రామంలో వర్షకాల సీజన్ రావడంతో మిషన్ భగీరథ వాటర్ ప్రాబ్లం ఏర్పడడం జరిగింది. ఈ నేపథ్యంలో రామయపల్లి సర్పంచ్ జక్కుల సత్యనారాయణ తక్షణమే స్పందించి మంచినీటికి సంబంధించిన పైపుల మరమత్తులను చేపట్టడం జరిగింది. వర్ష కాలంలో అక్కడక్కడ మంచినీటి సౌకర్యంలో ఇబ్బందులు ఏర్పడడం జరుగుతుంది. అలా జరిగినపుడు గ్రామస్తులెవరు తొందరపడకుండా నా దృష్టికి తీసుకురావాలని వెంటనే పరిష్కరిస్తానని అన్నారు. ఇందులో సఫాయి సిబ్బంది ఉన్నారు.






