13 June, 2026 | 6:38 PM

బెల్లంపల్లిలో క్రికెట్ అభివృద్ధికి పాటుపడతా: ఎమ్మెల్యే వినోద్

13-06-2026 05:35 PM

 బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి ప్రాంతంలో క్రికెట్ అభివృద్ధికి పాటుపడతానని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు.  స్థానిక రైల్వే స్టేషన్ ప్రాంతంలో మురళి మెమోరియల్ క్రికెట్ అకాడమీ నిర్మించిన మూడవ క్రికెట్ పిచ్ ని శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే వినోద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో మురళి మెమోరియల్ క్రికెట్ అకాడమీ క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తున్నదని, తాము కూడా ఇందులో పాలుపంచుకుంటామని తెలిపారు. అకాడమీకి కావాల్సిన సహాయ సహకారాలను అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ.. ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో జరిగే అండర్ 14, అండర్ 17 క్రికెట్ పోటీలను ఈసారి బెల్లంపల్లిలో నిర్వహిస్తామని అన్నారు.