నిర్మలహృదయ్ విద్యాసంస్థల చైర్మన్ వంగా సాంబశివరెడ్డి మృతి
09-08-2026 10:47 AM
ఖమ్మం ఆగస్టు09 విజయక్రాంతి: నిర్మలహృదయ్ విద్యాసంస్థల చైర్మన్ వంగా సాంబశివరెడ్డి (80) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మృతి పట్ల విద్యాసంస్థల సిబ్బంది, విద్యార్థులు, అభిమానులు, శ్రేయోభిలాషులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యారంగ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను పలువురు స్మరించుకున్నారు. ఆయన మృతి కుటుంబ సభ్యులకు, విద్యాసంస్థల సిబ్బందికి తీరని లోటని పేర్కొన్నారు. వంగా సాంబశివరెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని పలువురు ప్రార్థించారు.






