గూడాలలో ఘనంగా ఆదివాసి దినోత్సవం
09-08-2026 10:07 AM
ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసి గూడాలలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ ఉత్సవాలను నిర్వహించుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి గిరిజనులు వారి సాంప్రదాయ వాయిద్యాలు అయినా డోలు, కాలికోం ఇతర వాయిద్యాలు వాయిస్తూ.. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రత్యేక నృత్యాలు చేస్తూ ఆదివాసుల సాంప్రదాయ జెండాలను ఆవిష్కరించారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, సిరికొండ మండలాల పరిధిలోని గ్రామాల్లో ఆదివాసి దినోత్సవానికి ఘనంగా జరుపుకున్నారు.






