26 August, 2026 | 12:15 AM

బాన్సువాడ గౌడ సంఘం ఆధ్వర్యంలో వన మహోత్సవం

25-08-2026 08:10 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఫిల్టర్ బెడ్ వద్ద మంగళవారం గౌడ సంఘం,ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఈత మొక్కలను నాటి వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పర్యావరణ పరిరక్షణతో పాటు గీత కార్మికులకు ఉపయోగకరంగా ఉండేలా ఈత మొక్కలను విస్తృతంగా నాటాలని వారు సూచించారు. మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ దిలీప్ కుమార్, ఎస్సైలు శ్రావణ్ కుమార్, తేజస్విని, కానిస్టేబుళ్లు, గీత కార్మికులు బండి శ్రీనివాస్ గౌడ్, రామ గౌడ్, గౌడ సంఘం సభ్యులు జీడిపల్లి నర్సాగౌడ్, పెద్ద యాదగిరి గౌడ్, రాజా గౌడ్, ప్రవీణ్ గౌడ్, సతీష్ గౌడ్, నరేష్ గౌడ్, బలరాం గౌడ్, శేఖర్ గౌడ్, వేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.