కోడుగల్‌లో వన మహోత్సవం
25-08-2026 10:20 PM
ట్రైబల్ గురుకుల పాఠశాలలో మొక్కలు నాటిన సర్పంచ్ గోదల సాయిరెడ్డి
జడ్చర్ల: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమం జడ్చర్ల మండలం కోడుగల్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ఆవరణలో సర్పంచ్ గోదల సాయిరెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజేష్‌రెడ్డి, వార్డు సభ్యులు అంజమ్మ, రామస్వామి, నాగిరెడ్డి, మాజీ సర్పంచ్ నవీన్‌రెడ్డి, గురుకుల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






