26 August, 2026 | 12:47 AM

మొక్కలు నాటి.. పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం

25-08-2026 09:30 PM

బెజ్జంకి: సిద్దిపేట జిల్లా  బెజ్జంకి మండల కేంద్రంతో పాటు వీరాపూర్, గూడెం, గాగిల్లాపూర్ పలు గ్రామాల్లో వన మహోత్సవం  కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఆయా గ్రామాల సర్పంచ్‌లు కార్యక్రమాలను ప్రారంభించి మొక్కలు నాటారు. గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పెంపొందించేందుకు కృషి చేశారు. బెజ్జంకి గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని అన్నారు.

మొక్కలు పెంచడం వల్ల గ్రామాల్లో పచ్చదనం పెరగడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి కుటుంబం మొక్కలను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. వీరాపూర్ సర్పంచ్ మాట్లాడుతూ.. వన మహోత్సవం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగాలని అన్నారు. నాటిన ప్రతి మొక్కను బతికించేలా గ్రామస్థులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

గ్రామంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. గూడెం, గాగిల్లాపూర్ తదితర గ్రామాల్లోనూ సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు తమ పరిసరాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేష్, సెక్రటరీ ప్రణీత్ రెడ్డి, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్, ఏఎన్ఎమ్, ఆశ వర్కర్ లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.