calender_icon.png 19 February, 2026 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కందనూలు జిల్లాలో కల్వకుర్తి కనుమరుగయ్యింది

19-02-2026 01:48:07 AM

సరిచేయాలని జిల్లా కలెక్టర్‌కి వినతి

నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన కొన్ని మండలాలు ఆన్లైన్ అక్రిడేషన్ దరఖాస్తుల్లో రంగారెడ్డి జిల్లా పరిధిలో చూపిస్తున్న కారణంగా జ ర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కు వినతిపత్రం అందించారు. అనంతరం డిపిఆర్‌ఓ కిరణ్ కుమార్ను కలిసి అక్రిడేషన్ జారీ ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ నిజ మైన జర్నలిస్టులకు న్యాయం చేయాలన్నారు.

అధ్యక్ష కార్యదర్శులు విజయ్ కుమార్, సురేష్ కు మార్, నేషనల్ కౌన్సిల్ సభ్యులు సుదర్శన్ రెడ్డి, కర్ణయ్య, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షకార్యదర్శు లు వెంకటస్వామి, ప్రభాకర్, రాష్ట్ర నాయకులు శ్యామ్, జర్నలిస్టులు శ్రీధర్, పట్టాభి, రవీందర్, అహ్మద్ ఖాన్, బాబు, రమణ కుమార్, ప్రసాద్, రాంప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.