క్యాన్సర్ రాకుండా బాలికలకు వ్యాక్సిన్
పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే విజయ రమణారావు
పెద్దపల్లి, మార్చి 8(విజయక్రాంతి): జిల్లా ఆసుపత్రి, పెద్దపల్లి లో హెచ్ పి వి వ్యాక్సినేషన్‌ను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు, మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ముస్కాన్ నాజ్ నియర్ అలీ, కౌన్సిలర్ కొట్టే స్వరూప, ఇతర స్థానిక నాయకులతో కలిసి ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమం మూడు నెలల వరకు వైద్య విధాన పరిషత్ పరిధిలో గల జిల్లా ఆసుపత్రి, పెద్దపల్లి సి.ఎచ్.సి. మంథని, సి.ఎచ్.సి సుల్తానాబాద్, అదేవిదంగా జనరల్ ఆసుపత్రి రామగుండం లో అన్ని పని దినాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ వ్యాక్సిన్ ను 14 ఏళ్ల వయసు గల బాలికలకు అందించబడుతుందని, 14 సంవత్సరాల బాలికలు ఏజ్ ప్రూఫ్ కొరకు ఏదైనా ఐడి కార్డ్ మరియు పేరెంట్స్ ను తీసుకుని రావాలని, ఈ వ్యాక్సిన్ ను ఖాళీ కడుపుతో వేయించుకోకూడదు కావున ఏదైనా భుజించి రావలె నని, ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణరావు మాట్లాడుతూ మహిళా దినోత్సవము మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ వాక్సినేషన్ కార్యక్రమంను 14 ఏండ్ల బాలికలు వేయించుకొని సద్వినియోగం చేసు కావాలని కోరారు. మన జిల్లా లో సుమారు 7602 బాలికలు ఉన్నారు, వారందరికీ వ్యాక్సిన్ అందించ బడుతుందన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్ మరియు డి.సి.ఎచ్.ఎస్ డా. శ్రీధర్ మాట్లాడుతూ హెచ్. పి. వి అనేది హ్యూమన్ పాపిలోమా వైరస్ ద్వారా సోకే గర్భాశయ క్యాన్సర్ కు ముఖ్య కారణం. దీనివలన భారతీయ మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్. ఈ తీవ్రతను తగ్గించుటకు హెచ్ పి వీ వ్యాక్సిన్ ను ఇవ్వడం జరుగుతుందని, ఇది కొత్త వ్యాక్సిన్ కాదని, కావున భయపడవలసిన అవసరం లేదని ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ల కు పైగా ఈ వ్యాక్సిన్ ఇచ్చా రు. ఈ వ్యాక్సిన్ వలన తీవ్రమైన దుష్ప్రభావాలు లేవని, అన్ని వ్యాక్సిన్ ల లాగానే తేలిక పాటు తాత్కాలికమైన దుష్ప్రభావాలు అరుదుగా సంభవించవచ్చని, ఈ టీకా వల్ల వ్యంధత్వం.
గర్భస్రావం, పుట్టుకతో వచ్చే లోపాలకు కారణం అవుతుందనేది అపోహ మాత్రమే, ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ వ్యాక్సిన్ 2006వ సంవత్సరంలో వాడకం ప్రారంభమైందని, ఈ టీకా కొన్ని అధ్యయనాల ప్రకారం 93-100 శాతం సామర్థ్యం తో పని చేస్తుంది. రుతుస్రావం ఉన్నప్పటికిని ఈ టీకా వేయించుకోవచ్చునని, భారత ప్రభుత్వం అందించే క్వాడ్రి వాలెంట్ ఎచ్ పి వి టీకా యొక్క ఒకే మోతాదు ప్రభావంత మైనది. ఎచ్. పి. వి. సంక్రమణకు వ్యతిరేకంగా పని చేస్తుంది అని అన్నారు.
కార్యక్రమంలో నూగిల్ల మల్లయ్య మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ముస్కాన్ నాజ్ నియర్ అలీ, కౌన్సిలర్ కొట్టే స్వరూప, ఇతర కౌన్సిలర్ లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె ప్రమో ద్ కుమార్, టి. వి.వి.పీ. ఆసుపత్రుల హెడ్ క్వార్టర్స్ సూపరింటెండెంట్ డా. శ్రీధర్ ప్రోగ్రాం అధికారులు డా. బి. కిరణ్ కుమార్, డా. బి శ్రీరాములు, డా. కె. వి. సుధాకర్ రెడ్డి, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.




