విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు
- మహిళా ఆర్థిక శక్తి పెరిగినప్పుడే దేశం అభివృద్ధి
- కీలక శాఖల అధిపతులందరూ మహిళలే..
- కులాల మధ్యనే కాదు.. స్త్రీ, పురుషుల మధ్యా వివక్ష
- హైదరాబాద్‌ను కాలుష్యరహితంగా మార్చుతాం
- గాంధీ విగ్రహానికి రూ. 70 కోట్లే ఖర్చు: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి) : అంతర్జాతీయ మహిళా దినో త్సవం సందర్భంగా కాలేజీ విద్యార్థినులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీపి కబురు చెప్పారు. 18 ఏళ్లు నిండి కాలేజీ చదువుతున్న విద్యార్థినులకు త్వరలోనే ఎలక్ట్రిక్ స్కూటీలు ఇచ్చే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్స రం కుదరకపోవచ్చని కానీ త్వరలోనే వాటిని అందజేసే ఆలోచనతో ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకుని మహిళలు ఉన్నత స్థానాలకు చేరాలని సీఎం ఆంకాంక్షించారు.
ప్రజా భవన్‌లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో సీ ఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొం గులేటి శ్రీనివాస్‌రెడ్డి అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ మ హిళలకు ఎప్పుడు గుర్తింపు ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు.
కీలకమైన శాఖలన్నీ మహిళా అధికారులు సమర్థవంతంగా నడిపిస్తున్నారని కితాబిచ్చారు. దేశం లో కులాల మధ్యే కాదు స్త్రీ, పురుషుల మధ్య కూడా వివక్ష ఉందన్నారు. మహిళ ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఏదేశమైనా అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందుతుందన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్య వస్థగా రాష్ట్రం ఎదగాలని, అందుకు ప్రణాళికలను తయారు చేశామన్నారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ సాధ్యమైందన్నారు.
మహిళలకు ఏసీ బస్సుల్లో ప్రయాణం..
కార్పొరేట్ సంస్థల ఉత్పత్తులు మాత్రమే అందుబాటులో ఉండే అమెజాన్‌లో స్వ యం సహాయక సంఘాల ఉత్పత్తులను అమెజాన్‌లో ప్రపంచానికి విక్రయించేలా అవకాశం కల్పించామని సీఎం పేర్కొన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. అయితే బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తారని వారిని చిన్నచూపు చూస్తారని.. వారి చేతనే బస్సులకు యజమానులను చేసి వ్యాపారాల్లో రాణించేలా ప్రభుత్వం అవకాశం కల్పించిందని చెప్పారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం స్వయం సహాయం సంఘాలకు అవకాశం ఇచ్చామన్నారు. 2026 డిసెంబర్ నాటికి నగరంలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులే నడుస్తాయన్నారు. పెట్రోల్, డీజిల్ ఆటోలను కూడా ఎలక్ట్రిక్‌గా మార్చుతామన్నారు.
ప్రత్యామ్నాయం చూపుతాం..
హైదరాబాద్‌లో కాలుష్యం, దోమలు ఎక్కువగా ఉన్నాయంటున్నారని, మూసీ ప్రక్షాళన చేస్తామంటే అడ్డుకుంటున్నారని సీ ఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన వద్దంటున్నారా..? తొలగింపులు వద్దం టున్నారో స్పష్టత ఇవ్వాలన్నారు. సౌత్ కోరి యా, న్యూయార్క్, టోక్యోతో హైదరాబాద్ పోటీ పడేలా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు, మధుపార్క్ అపార్టుమెంట్ విష యంలో వస్తున్న ఆరోపణలపై సీఎం స్పం దించారు.
ఈ అపార్ట్ మెంట్ ఈసా నది ఒ డ్డున ఉందని ఇది నాలా అని చూపించి అక్క డ బిల్డర్ అపార్ట్ మెంట్ కట్టారు. 2012 చ ట్టం ప్రకారం మూసీ, ఈసా నది ఒడ్డున 50 మీటర్ల బఫర్ జోన్ లో ఎవ్వరూ ఏమి కట్టవద్దని, ఏదైనా కట్టినా వాటిని తొలగించా లని ఎన్జీటీ, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. ఈ 7 ఎకరాల్లో ఉన్న ఈ అపార్ట్ మెంట్‌కు బదులుగా పక్క నే ఉన్న 7 ఎకరాల స్థలం కేటాయించి ఇప్పు డు ఎంత పరిమాణంలో నిర్మాణం జరిగిం దో అంతటి నిర్మాణానికి అవసరం అయ్యే నిధులను బ్యాంకులో నిధులు డిపాజిట్ చేస్తామన్నారు.
నష్టపరిహారం తీసుకుని వేరే చోట కొనుగోలు చేసుకుంటామంటే అది మీ ఇష్టమని, మీరు ఒక అసోసియేషన్ గా ఏర్పడాలని అధికారులతో నేను చెప్పి పం పించానని చెప్పారు. గాంధీ విగ్రహం కట్టడానికి రూ.500 కోట్లు అని తప్పుడు ప్రచా రం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గాంధీ విగ్రహానికి రూ. 70 కోట్లే ఖర్చు అవుతుందని, గాంధీ విగ్రహాం వద్ద విజ్ఞాన మం దిరానికి రూ. 100 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం తెలిపారు. ఈ నెల 13న మూసీ రివర్ ప్రంట్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందన్నారు.
జర్నలిస్టులకు త్వరలోనే శుభవార్త చెబుతా..
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపైన త్వరలోనే మంచి వార్త చెబుతానని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. చట్టం వల్ల ఇబ్బందులు లేకుండా నిర్ణయం తీసుకుంటామని, ప్యూచర్ సిటీలో జర్నలిస్టులకు మంచి కాలనీని డిజైన్ చేస్తామన్నారు. ఫీల్డ్ జర్నలిస్టులకు, డెస్క్ జర్నలిస్టులకు ఎలాంటి తేడా లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రసారమయ్యే తప్పుడు కథనాలపై ఫిర్యాదు చేయడానికి ఒక వేదిక ఏర్పాటు చేస్తామన్నారు. మహిళా జర్నలిస్టులను సీఎం రేవంత్‌రెడ్డి సన్మానం చేశారు.




