13 May, 2026 | 4:43 PM

Breaking News

చిత్ర పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత   •   సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈఓ భేటీ   •   జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు   •   కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యునిగా రాపాక ప్రవీణ్   •   రైతులు పండించిన జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలి   •   గీతంలో పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్   •   నార్కో-టెర్రరిస్ట్‌ షేరా అరెస్ట్.. పోర్చుగల్ నుండి భారత్‌కు   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూడటం లేదు   •   బొప్పపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం   •   విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్   •  

గృహజ్యోతి పథకంతో ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని పిల్లల చదువులకు ఉపయోగించుకోండి

17-01-2026 01:08 AM

ముత్తారం, జనవరి 16(విజయ క్రాంతి): గృహ జ్యోతి పథకంతో ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని పిల్లల చదువులకు ఉపయోగించుకోవాలని మండలంలోని ఖమ్మంపల్లి, సీతంపేట, రామకృష్ణాపూర్ ల లో ప్రజలకు అవగాహనలో మంథని ట్రాన్స్ కో సీనియర్ అసిస్టెంట్ ఆంజనేయులు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రజా ప్రభుత్వం గృహ జ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తుందని, మీరు వాడిన బిల్లులను ప్రభుత్వం నేరుగా విద్యుత్ సంస్థకు చెల్లిస్తుందని, విద్యుత్ బిల్లుల ఖర్చు చేసే డబ్బులను పిల్లల చదువు, మీ ఆరోగ్యం, కుటుంబా అవసరాలకు ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రూ. 52. 82. 498 కుటుంబాలు జీరో విద్యుత్ బిల్లులు ద్వారా లబ్ధి పొందారని, సుమారు మూడు కోట్ల 593 కోట్లు ప్రభుత్వం లబ్ధిదారుల పక్షాన విద్యుత్ సంస్థలకు డబ్బులు చెల్లించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మంపల్లి లైన్ మెన్ కుమారస్వామి, అసిస్టెంట్ లైన్ మెన్ రాజేష్, సిబ్బంది నాగరాజు నితిన్ తదితరులు పాల్గొన్నారు.