16-02-2026 12:00:00 AM
రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్‌రెడ్డి
రాజేంద్రనగర్ ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఆయా కాలనీలలో నెలకొన్న సమస్యలపై ప్రజలు నేరుగా బండ్లగూడ జాగిర్ లోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరై తమ ఫిర్యా దులను అందజేయడం వచ్చునని డిసి సు రేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ప్రజావాణి కార్యక్రమానికి వివిధ విభాగాల అధికారులు. ద్వితీయ శ్రేణి సిబ్బంది హాజరు అవు తారని డిసి పేర్కొన్నారు. పారిశుద్ధం మంచినీరు వీధి దీపాలు రోడ్లు అక్రమ నిర్మాణా లుతోపాటు తదితర సమస్యలపై ప్రజలు నేరుగా అధికారుల సమక్షంలో తమ విజ్ఞప్తులను అందజేయాలని డిసి పేర్కొన్నారు.