1 July, 2026 | 8:09 PM

Breaking News

ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •  

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి

16-03-2026 08:52 PM

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్ బోస్

ఉప్పల్,(విజయక్రాంతి): సామ్రాజ్యవాద దురాక్రమనే లక్ష్యంగా ప్రమాదకరకంగా అమెరికా దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ దేశ అధ్యక్షుడు నేతన్యాహు జియోనిస్ట్ కూటమి వ్యవహరిస్తూ ఇరాన్‌పై దాడి చేయడం అంతర్జాతీయ హక్కుల ఉల్లంఘన అని, తక్షణమే యుద్దాన్ని ఆపి, శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మల్లాపూర్ లో  ప్లకార్డులు చేతబూని నిరసన ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్. బోస్. మాట్లాడుతూ ప్రపంచ శాంతి మరియు మానవత్వం కోసం యుద్ధం కాకుండా సంభాషణలు, రాజదౌత్యం మాత్రమే మార్గమని చరిత్ర ఎన్నోసార్లు నిరూపించిందన్నారు. అయినప్పటికీ ప్రపంచంలోని సామ్రాజ్యవాద శక్తులు అమెరికా, ఇజ్రాయిల్  తమ రాజకీయ, ఆర్థిక ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు మధ్యప్రాచ్య దేశాలను యుద్ధ వేదికగా మార్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఇరాన్‌పై యుద్ధ వాతావరణం సృష్టించడం కూడా అదే విధమైన ప్రమాదకర ధోరణికి నిదర్శనమన్నారు.

యుద్ధం ఎప్పటికీ సాధారణ ప్రజలకు మేలు చేయదని,యుద్ధం వల్ల కార్మికులు, రైతులు, పేద ప్రజలు, మహిళలు మరియు పిల్లలే అత్యంత భయంకరమైన నష్టాన్ని ఎదుర్కొంటారన్నారు. గతంలో మధ్యప్రాచ్య ప్రాంతంలో జరిగిన యుద్ధాల వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు, కోట్లాది మంది తమ నివాసాలను వదిలి వలసబాట పట్టాల్సి వచ్చిందని, అలాంటి విషాదకర పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకూడదన్నారు.

ప్రపంచ దేశాల మధ్య ఉన్న విభేదాలను యుద్ధం ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నించడం అంతర్జాతీయ శాంతికి తీవ్రమైన ముప్పు అని, ఆయుధ శక్తి ద్వారా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం ప్రపంచాన్ని మరింత అస్థిరత వైపు నడిపిస్తుందన్నారు. అందుకే సమస్యల పరిష్కారానికి చర్చలు, పరస్పర గౌరవం, అంతర్జాతీయ చట్టాల పాటింపు అవసరమన్నారు.అమెరికన్ సామ్రాజ్యవాద యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ప్రపంచంలోని కార్మిక వర్గం, ప్రజాస్వామ్యవాద శక్తులు, శాంతి ప్రియులు ఐక్యంగా గళం వినిపించాలన్నారు. యుద్ధాన్ని ప్రోత్సహించే రాజకీయాలను ఖండిస్తూ ప్రపంచ శాంతి కోసం ప్రజలు పోరాటం చేయాలని ఏఐవైఎఫ్ పిలుపునిస్తోందన్నారు.

ఇరాన్ పై యుద్ధం జరుగుతుంటే మన దేశ ప్రధాని మోడీ నేతృత్వంలోని భారత విదేశాంగ విధానంలో లోతైన సంక్షోభాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. డొనాల్డ్ ట్రంప్ నిర్దేశించిన అనుమతి, సమయపాలనకు లోబడి రష్యాతో భారతదేశం యొక్క చమురు వాణిజ్యం అవమానకరమైన పరిస్థితితో సహా-వాషింగ్టన్ నుండి వచ్చే ఒత్తిడికి సమర్థవంతంగా తలవంచడం ద్వారా ప్రభుత్వం దేశం సార్వభౌమ నిర్ణయాధికారంలో రాజీ పడిందన్నారు. ఇటువంటి విధేయతతో కూడిన దౌత్యం వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిపై భారతదేశం యొక్క చారిత్రాత్మక నిబద్ధతను బలహీనపరుస్తుందన్నారు.