1 July, 2026 | 9:21 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

16-03-2026 08:56 PM

జోనల్ కమిషనర్‌కు తుంగతుర్తి రవి వినతి

మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని 9వ డివిజన్ మేడిపల్లి కాలనీల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఉప్పల్ జోనల్ కమిషనర్‌కు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్వి ఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి నేతృత్వంలో సాయి ప్రియ నగర్, ఐఐ సిటీ కాలనీ, ధరణి కాలనీల అధ్యక్షులు, స్థానిక నివాసితులు సోమవారం జోనల్ కమిషనర్ కార్యాలయంలో ఎస్ఈ హరికిషోర్, ఏఎంసి ఆనంద్ కుమార్ కి వినతి పత్రం సమర్పించడం జరిగింది.

  ​ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ... మేడిపల్లిలోని సాయి ప్రియ నగర్, ఐఐ సిటీ కాలనీ, ధరణి కాలనీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలలో సరైన రోడ్లు లేక, ఉన్నవి పూర్తిగా గుంతలమయమై వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటం వల్ల మురుగు నీరు రోడ్లపైనే నిలిచిపోయి అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని,

పెరిగిన జనాభాకు అనుగుణంగా మంచినీటి సరఫరా పెంచాలని, కొత్త పైప్‌లైన్లను వెంటనే విస్తరించాలని వినతి పత్రాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో శంకర్ రెడ్డి, జైహింద్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, యాసారం నాగేష్, వెంకటేష్ గౌడ్, చిలుముల అజయ్ రెడ్డి, బత్తుల వెంకటేష్ గౌడ్, సాయిరాం గౌడ్ మరియు కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు, కమిటీ సభ్యులు , స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో నివాసితులు పాల్గొన్నారు.