10 June, 2026 | 3:08 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

అమెరికా అదుపులో వెనెజులా అధ్యక్షుడు

03-01-2026 04:29 PM

వాషింగ్టన్: వెనిజులాపై అమెరికా భారీ స్థాయిలో దాడి చేసిన తర్వాత ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురో(Venezuelan President Maduro) పట్టుబడ్డారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(President Donald Trump) ప్రకటించారు. మదురో భార్యను కూడా పట్టుకుని దేశం వెలుపలికి తరలించారని ట్రంప్ తెలిపారు. శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వెనెజువెలా రాజధాని కరాకస్ పై అమెరికా దాడులు చేసింది.

రాకస్ లోని 7 ప్రాంతాలపై అమెరికా దాడులు చేసింది. డ్రగ్స్ అక్రమరవాణా విషయంలో ట్రంప్ వెనెజువెలాను లక్ష్యంగా చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరాకు వెనెజువెలా అధ్యక్షుడు(Venezuelan President) మదురో సహకరిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. అయితే, అధ్యక్షుడు మదురో, ఆయన భార్య ఆచూకీ గురించి తమ ప్రభుత్వానికి తెలియదని వెనిజులా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తర్వాత పేర్కొన్నారు. వారి ప్రాణాలతో ఉన్నట్లు రుజువు చూపాలని డిమాండ్ చేశారు. రాజధాని కారకాస్‌తో పాటు మిరాండా, అరగువా, లా గువైరా రాష్ట్రాలలో కూడా దాడులు జరిగాయని వెనిజులా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.