10 June, 2026 | 4:11 PM

Breaking News

నల్గొండ జిల్లా అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష   •   ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై పుస్తకావిష్కరణ   •   సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •  

అసెంబ్లీలో అక్బరుద్ధీన్ అసహనం

03-01-2026 04:00 PM

కృష్ణా, గోదావరి జలాలు తప్ప వేరే టాపిక్ లేదా...

హైదరాబాద్: కృష్ణా జలాలపై తెలంగాణ శాసనసభలో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ అసహనం వ్యక్తం చేశారు. అర్థరాత్రి వరకు ఎజెండా రావడం లేదని, షార్ట్ డిస్కషన్ దేనిపై ఉంటుందో తెలియడం లేదని మండిపడ్డారు. ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదని, కృష్ణా, గోదావరి జలాలు తప్ప వేరే టాపిక్ లేదని అక్బరుద్ధీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎజెండా ఇవ్వకపోతే సభలో ఎలా ప్రిపేర్ అవుతారని, సభా హక్కులను స్పీకర్ కాపాడాలని అక్బరుద్ధీన్ ఒవైసీ పేర్కొన్నారు.