3 March, 2026 | 2:25 AM

యూరియా.. ఏదయా?

03-03-2026 12:17 AM
  1. రైతుల బాధ వర్ణాతీతం
  2. ఒకవైపు పొట్ట దశలో పంట మరోవైపు చేతికందని యూరియా
  3. సంక్షేమ పథకాలు అమలులో సాంకేతిక లోపాలు 
  4. ప్రతిపక్షాలు ప్రజా సంఘాలతో పోరాటానికి సిద్ధమవుతున్న రైతాంగం

నిజామాబాద్, మార్చి 2 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లాలో యూరియా కొరతతో రైతులు సతమతమవుతున్నారు. ఒకవైపు పొట్టదశకు వచ్చిన పంట మరోవైపు చేతికందని యూరియా తో రైతుల బాధ వర్ణాతీతంగా మారింది. ఎన్నో ఆర్థిక వయా ప్రయాస కూర్చి పంటలు వేస్తే పంటలు పొట్టదశకు వచ్చినప్పటికీ యూరియా వెయ్యకపోతే పంటలు దిగుబడి రావని ఫలితంగా తీవ్రంగా నష్టపోతామని రైతులు వాపోతున్నారు.

అన్నమో రామచంద్ర అన్న పదం కాస్త రైతుల విషయంలో యూరియా.. రామచంద్ర అన్న చందనంగా మారింది. ప్రభుత్వ సరఫరా లోపమా లేక అధికారుల నిర్లక్ష్యం లేక సాంకేతికత లోపమా... అనే స్పష్టత లేకుండా ఉంది ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాంకేతిక పద్ధతులు. సరైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చేపడుతున్న సాంకేతిక పద్ధతుల లోపాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరుతో పాటు, రైతులకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతోంది.

ఇది ఇలా ఉండగా యూరియా సరఫరా విషయమై రైతు సంఘాలు ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు కలిసి తమ ఆందోళనను ఉదృతంగా చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు రైతు సమస్యల పరిష్కారానికి రేవంత్ సర్కార్ రైతులకు ఇచ్చిన హామీల అమలుకు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడానికి రంగం సిద్ధం అవుతుందని తెలుస్తోంది.

ఈ మేరకు ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు రైతు కూలీ సంఘాలు రైతు కమిటీల నాయకులు ఒక తాటిపై కొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగనున్నారు. ముఖ్యంగా జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని ప్రధాన అంశాలతో కూడిన ఆందోళన సిద్ధమవుతోంది.

ఇప్పటికే యూరియా కై రైతులు మండలాల వారీగా తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు మొన్న ఎక్రాజ్ పల్లి లో మున్న నవీపేట్ మండలం బాసర రహదారిలో శనివారం ఇందల్వాయి పిఎసిఎస్ వద్ద ధర్నా నిర్వహించారు. యూరియా సరఫరాల్లో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  పొట్ట దశకు వచ్చిన తమ పంటలను కాపాడుకోవడానికి రైతన్నలు పడరాని పాట్లు పడుతున్నారు.

మరోవైపు వచ్చిన కొద్దిపాటి స్టాక్ విషయమై పిఎసిఎస్ లకు చేరుకొని రైతులు అధికారులను సంప్రదించగా యాప్ ద్వారా నమోదు చేసుకున్న వారికే యూరియా ఇస్తామని అధికారులు తేల్చి చెబుతున్నారు. మరోవైపు యూరియాకి నమోదు చేసుకోవడానికి రైతులు యాప్ ను తెరవగా అందులో నో స్టాక్ అని బోర్డు దర్శనమిస్తోంది ఈ విషయమై ఆగ్రహం చెందిన రైతులు అధికారులు నిలదీస్తూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు.

ఈ యూరియా విషయమై ఆందోళనలు మరింత ఉధృతం కానున్నట్టు స్పష్టమవుతోంది. యూరియా యాప్ ను పూర్తిగా ఎత్తివేసి పాత పద్ధతిని రైతుల గుర్తింపు కార్డులతో సరఫరా చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. యాప్ ద్వారానే రైతులు యూరియా బస్తాలకై నమోదు చేసుకోవాలంటే ఫోన్లు లేని రైతుల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని యూరియాకుర్తను తీర్చకుంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు సాంకేతికతను చేర్చడంతో అందులో ఉన్న లోపాల వల్ల జిల్లా రైతాంగం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. గతంలో పాత పద్ధతిలో యూరియా సరఫరా జరుగుతే అనేక అవకతవకలు బ్లాక్ మార్కెట్ కు యూరియా చేరుతోందని ఫలితంగా రైతులకు అందడం లేదన్న ఉద్దేశంతో ప్రభుత్వం యాప్ పద్ధతిని ప్రవేశపెట్టింది.

యూరియా యాప్, పసుపు పంటకై ఈనామ్ 1.0, ను ఆధునికరిస్తూ ఈ నామ్ 2.0 వెర్షన్ ప్రభుత్వం ప్రవేశపెట్టగా సాంకేతికత లోపంతో ఈ నామములో పనిచేయకపోవడంతో రెండు మూడు రోజులు భారీగా పసుపు పంటను రైతులు మార్కెట్ యార్డ్ కు తరలించడంతో నిజామాబాద్ జిల్లా మార్కెట్ యార్డులో 25 నుంచి 35 వేల బస్తాల వరకు పసుపు నిల్వలు పేరుకుపోయాయి.

అదే సమయంలో వాతావరణం లో అకస్మాత్తుగా వచ్చిన మార్పుల వల్ల వర్షాలు కురవడంతో గాలిలో కేమరావడంతో యాడుకు తెచ్చిన పసుపు దెబ్బతింటుందని వెంటనే కొనసాగించాలని రైతులు ఆందోళనకు దిగి మార్కెట్ కమిటీ కార్యాలయం చేరుకొని అధికారులను నిలదీశారు.

తమ చేతుల్లో ఏమీ లేదని అంతా పైనుంచి ఆదేశాలు రావాలని మార్కెట్ కమిటీ అధికారులు చేతులెత్తేయడంతో ఆగ్రహించిన రైతులు మార్కెట్ కమిటీ పై దాడికి పాల్పడ్డారు. రైతుల దాడితో మేల్కొన్న అధికారులు పాత పద్ధతి ద్వారానే మాన్యువల్ విధానంలో పసుపు విక్రాయాలు కొనసాగించారు.