నేడు యూరియా స్టాక్ బుకింగ్
20-08-2026 12:48 PM
కోహెడ, ఆగష్టు 20, విజయక్రాంతి: సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రం లోని మూడు షాప్ లలో ఈ రోజు మధ్యాహ్నం 3:00 గంటలకు యూరియా స్టాక్ బుకింగ్ అందుబాటులో ఉంటుందని.. మండల విస్తరణ అధికారి శ్రీధర్ రెడ్డి తెలిపారు. గ్రోమోర్ కోహెడలో 666 బస్తాలు, అశ్విని పర్టీలైజర్ షాప్ లో 335 బస్తాలు, విజయలక్ష్మి పర్టీలైజర్ షాప్ 335 బస్తాలు అందుబాటులో ఉంచామన్నారు. రైతులు ఎఫ్ఎఫ్ఎస్ అప్ ను డొన్లోడ్ చేసుకొని.. యూరియా ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.






