10 April, 2026 | 3:03 AM

కొత్వాల్‌గూడలో అక్రమ కాంక్రీట్ మిషన్ల కలకలం

10-04-2026 12:00 AM
  1. సిపిఐ అల్టిమేటం!
  2. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మిషన్లు వెంటనే ఆఫ్ చేయాలి
  3. చర్యలు లేకపోతే తీవ్ర ఉద్యమం చేస్తామని హెచ్చరిక
  4. ఎమ్మార్వోకు వినతిపత్రం
  5. యజమానులపై చట్టపరమైన చర్యల డిమాండ్

శంషాబాద్. ఏప్రిల్ 9 (విజయ క్రాంతి): శంషాబాద్ మండల పరిధిలోని కొత్వాల్ గూడలో అక్రమంగా నడుస్తున్న కాంక్రీట్ మిషన్లపై కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ కొనసాగుతున్న ఈ మిషన్లను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించింది.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ& ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా, నిబంధనలకు విరుద్ధంగా మిషన్లు నడుస్తున్నాయని ఆరోపించారు. కాంక్రీట్ మిషన్లను తక్షణమే ఆఫ్ చేయాలని, లేకపోతే యజమానులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడు రాచమల్ల యాదగిరి, మండల కార్యదర్శి నర్రగిరి హెచ్చరిస్తూ& అధికారులు వెంటనే స్పందించకపోతే పార్టీ తరఫున ఉద్యమం చేపట్టి, ఈ అక్రమ మిషన్లను పూర్తిగా తొలగించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.