ఉప్పల్‌లో నరకయాతన
ఉప్పల్ రింగ్‌రోడ్డు మూసివేత.. కిక్కిరిసిపోతున్న గల్లీలు
డైవర్షన్ బోర్డు లేక వాహనదారులకు ఇబ్బందులు
గందరగోళంగా ట్రాఫిక్ వ్యవస్థ
గంటల తరబడి వాహనాలు కదలని పరిస్థితి
ఉప్పల్, మే18 (విజయక్రాంతి): ఉప్పల్ రింగ్ రోడ్ వరంగల్ హైవే మార్గం పూర్తిగా మూసివేయడంతో ఉప్పల్ మార్గం నరకయాతనగా మారింది. ఉప్పల్ రిజిస్ట్రేషన్ కార్యాల యం వెళ్లే దారి, మెట్రో స్టేషన్ దారి, ఉప్పల్ గణపతి ఫ్యాక్టరీ దారి నిత్యం వాహనాలు భారీ సంఖ్యలో రాకపోకలు సాగించడంతో గల్లీలు కిక్కిరిసిపోతున్నాయి.
దీంతో గంటల తరబడి వాహనాలు కదలని పరిస్థితి ఏర్పడడంతో ట్రాఫిక్ పోలీసులు గల్లిలో శ్రమిస్తున్నారు. ఉప్పల్లోని రాజిరెడ్డి ఎలివేటెడ్ కార్డెన్ నిర్మాణ పనుల కోసం వరంగల్ జాతీయ రహదారి గుండా ఉప్పల్ రింగ్ రోడ్డుకు వాహనాలు రాకుండా రోడ్డును మూసివేశారు. ఉప్పల్ రింగ్ రోడ్‌లోని స్మశానాల వద్ద కార్డియార్ సం బంధించిన పిల్లర్ నిర్మాణాలు పనుల చేపట్టడంతో దీంతో ఉప్పల్ రింగ్ రోడ్డుకు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి.
కార్యాలయాలకు వెళ్లే వాహన దారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. పక్కనే ఉన్న చిన్న గల్లీలో నుండి వాహనదారులు వెళ్లడంతో ఉప్పల్ పరిసర ప్రాం తంలో ఉన్న గల్లీలు వాహనదారులతో కిక్కిరిసిపోతున్నాయి. వరంగల్ జాతీయ రహదారి గుండా నగరానికి వచ్చే వాహనదారులకు నల్లచెరువు దాటాక ఉప్పల్ భగాయత్‌లోనికి హెచ్‌ఎండిఏ లేఔట్ మీదుగా వెళ్లాలి.
మరో మూడు నెలలు పాటు..
సరియైన డైవర్షన్ బోర్డు లేకపోవడంతో వాహనదారులు ఎటు పోవాలా తెలియక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెల కొన్నది. రింగ్ రోడ్డు వరకు వచ్చి రహదారి బంధువులనుతో ఎటు వెళ్ళాలో అర్థం కాక రహదారి మధ్యలోనే ఆగిపోవడం వల్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు గంటలు తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
అత్యవసర పరిస్థితిలో వెళ్లే వాహనదారులు ట్రాఫిక్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో మూడు నెలలు పాటు కార్డియార్ పనులు జరగనుండడంతో ట్రాఫి క్ మళ్లింపు ఉంటుందని ట్రాఫిక్ అధికారులు తెలిపారు. రానున్న వర్షాకాలం రింగ్ రోడ్డు మూసేయడం ట్రాఫిక్ మళ్లింపుతో వాహనదారులు మరో మూడు నెలలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అత్యవసరంగా వెళ్లాలనుకునే వాహనదారులు గమనించి మరొక దారిని చూసుకోవడం మంచిదని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.






