యుఓహెచ్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: ఆర్థిక అర్థశాస్త్రం మొదటి సంవత్సరం విద్యార్థి మరణించిన ఘటన క్యాంపస్‌లోని బఫెలో లేక్ లో బుధవారం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మయూఖ్ కుండు అనే విద్యార్థి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ(Hyderabad Central University) క్యాంపస్‌లో ఆర్థిక శాస్త్రం (Financial Economics) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఎఫ్ హాస్టల్‌లో ఉంటున్న ఒక ఇంటర్న్ ల్యాప్‌టాప్‌ను మయుఖ్ దొంగిలించాడని ఆరోపణలు వచ్చాయి.
అతను ఆ దొంగతనాన్ని అంగీకరించి, పరిహారంగా తన సొంత ల్యాప్‌టాప్‌ను అప్పగించినట్లు సమాచారం. అంతేకాకుండా అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) కార్యకర్తల చేతిలో దాడికి, బహిరంగ అవమానానికి గురైనట్లు ఆరోపణలతో మనస్థాపానికి గురై మయుఖ్ మంగళవారం ఉదయం క్యాంపస్‌లోని బఫెలో లేక్ లో విగతజీవిగా కనిపించాడు. ఈ ఘటనకు ముందు రోజు అదృశ్యమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. అధికారులు అతని హాస్టల్ గదిని పరిశీలించగా, ఆత్మహత్య లేఖ కనిపించింది.
ఆ లేఖ ఆధారంగానే వారు సరస్సు వద్దకు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మృత్యుడిపై వచ్చిన దొంగతనం ఆరోపణలపై విశ్వవిద్యాలయం ఎటువంటి స్పందన తెలియజేయలేదని పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిసింది. ఆ అవమానంతోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.






