రైతులకు ఆధునిక సాగుపై అవగాహన
కంగ్టి,(విజయక్రాంతి): ఆత్మ శిక్షణ కార్యక్రమంలో భాగంగా కంగ్టి మండలంలోని జంగి రైతు వేదికలో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.గత అనుభవాల ఆధారిత గుర్తింపు (ఆర్‌పీఎల్) శిక్షణలో భాగంగా కేవీకే శాస్త్రవేత్త డా. శ్రీ రమేష్ రైతులకు పలు సాంకేతిక అంశాలను వివరించారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నూనెగింజల పంటల సాగు పంటల వైవిధ్యీకరణ ప్రకృతి వ్యవసాయం నానో ఎరువులవినియోగం, ఎరువులు–పురుగుమందుల సమగ్ర యాజమాన్యం హెచ్‌టీ బీటీ పత్తి సాగు, అంతర పంటల సాగు, సమగ్ర సస్యరక్షణ పద్ధతులపై అవగాహన కల్పించారు.
తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచించారు.సాగు ఖర్చులను తగ్గించుకుని పంటల దిగుబడిని పెంచుకునేందుకు శాస్త్రీయ పద్ధతులను పాటించాలని రైతులకు సూచించారు.పంట అవశేషాల నిర్వహణ రైతు నమోదు వానాకాలం రబీ పంటల ప్రణాళిక సన్న వడ్ల ఆన్‌లైన్ నమోదు ప్రకృతి వ్యవసాయం ఆయిల్‌పామ్ సాగుపై సహాయవ్యవసాయ సంచాలకులు కె.నూతన్ కుమార్ రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హరీష్ పవర్, వ్యవసాయ విస్తరణ అధికారి భార్గవ్, హన్మండ్లు వివిధ గ్రామ సర్పంచ్ లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.






