మాలల మహాధర్నాను విజయవంతం చేయాలి
బెజ్జంకి: ఈ నెల 23న దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న మాలల మహాధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య పిలుపునిచ్చారు. బెజ్జంకి మండల కేంద్రంలో నీ అంబేద్కర్ కూడలిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎస్సీ మాలలపై జరుగుతున్న అన్యాయం, ఏబీసీడీ వర్గీకరణ, రోస్టర్ విధానానికి నిరసనగా ఈ మహాధర్నాను చేపడుతున్నట్లు తెలిపారు.
రాష్ట్ర, జిల్లా నాయకులు, మాల సంఘాల ప్రతినిధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరసయ్య, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎల శేఖర్ బాబు, దామర శంకర్, రాజ మహేందర్, మాశం బాబు, సంఘం మధు, రాకం ఆంజనేయులు, రమేష్, సాయి, దొంతుల రాయమల్లు, తిరుపతి, చంద్రయ్య, లక్ష్మణ్, యాస బాబు తదితరులు పాల్గొన్నారు.






