13 August, 2026 | 8:59 PM

ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

13-08-2026 07:29 PM

యూఎస్పిసి నేరేడుచర్ల మండలం

నేరేడుచర్ల,(విజయక్రాంతి): ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ.. యూఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ 4 దశల పోరాటానికి పిలుపునిచ్చింది.ఇందులో భాగంగా ఈ నెల 7న నల్లబ్యాడ్జీలతో నిరసన, ఈరోజు తహసీల్దార్ ద్వారా సీఎంకు మెమోరాండం సమర్పించారు. పీఆర్సీ అమలు, 6 డీఏల బకాయిలు, పాత పెన్షన్, హెల్త్ కార్డులు, 25 జీవో సవరణ తదితర డిమాండ్లను నాయకులు ప్రస్తావించారు. ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 19న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, 29న హైదరాబాద్‌లో మహాధర్నా, సెప్టెంబర్‌లో చలో అసెంబ్లీ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్షులు ఆర్. శ్రీనయ్య, బి. అక్కయ్యబాబు, ఎన్. సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.