కారముంగిలో శ్రావణ మాస ప్రవచనాల పోస్టర్ ఆవిష్కరణ
13-08-2026 07:35 PM
నాగల్ గిద్ద,(విజయక్రాంతి): శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని కారముంగిలో శ్రావణ మాస ప్రవచన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాల పోస్టర్‌ను నిర్వాహకులు ఆవిష్కరించారు. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 12 వరకు ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరమపూజ్య శ్రీ నడోజ డా. బసవలింగ పట్టదేవరుల దివ్య ఆశీస్సులతో కార్యక్రమాలు కొనసాగనున్నాయి. అంబిక స్వామి, శివానంద స్వామి ఆధ్యాత్మిక ప్రవచనాలు అందించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమం లో ఉపసర్పంచ్ విశ్వనాథ్,మాజీ సర్పంచ్ కాశీనాథ్ గడ్డే,అనిల్ పాటిల్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.






