వంతెన నిర్మాణ పనులకు అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలను తొలగించాలి
20-05-2026 11:13 AM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ పట్టణంలో నిర్మిస్తున్న రైల్వే వంతెన పనుల్లో భాగంగా విద్యుత్ తీగలను తొలగించుటకు విద్యుత్ అధికారులు ఏఈ, డీఈలను కలిసి ఘట్కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ చర్చించారు.
రైల్వే వంతెన పనుల్లో భాగంగా పాత కల్కి హాస్పటల్ దగ్గర వేస్తున్న స్లాబ్ కి విద్యుత్ తీగలు అడ్డు రావడంతో కాంట్రాక్టర్ సత్తిరెడ్డి మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ కు తెలపడంతో విద్యుత్ తీగలను తొలగించుటకు మరమ్మత్తు పనులు చేపట్టాలని విద్యుత్ ఏఈ, డీఈ లను మాజీ సర్పంచ్ యాదగిరి యాదవ్ కోరడం జరిగింది.






