రేవంత్ ఢిల్లీ టూర్.. మంత్రి పదవులపై ఉత్కంఠ
01-09-2026 08:44 AM
న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. జలశక్తి సమావేశంలో పాల్గొని రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రంతో చర్చించనున్నారు. ముఖ్యంగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపుపై చర్చించే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ అధిష్ఠానంతో మంత్రివర్గం విస్తరణపై సీఎం కీలకంగా చర్చించనున్నట్లు సమాచారం. మంత్రి పదవులు ఆశిస్తున్న పలువురు నేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తోంది. అలాగే మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగించే అంశంపైనా అధిష్ఠానంలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.






