11 May, 2026 | 11:57 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ

08-02-2026 06:21 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి శివాలయంలో శివరాత్రి సందర్భంగా ఈ నెల 14,15,16 తేదీల్లో నిర్వహించనున్న శివపార్వతిదేవిల కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికలను సర్పంచ్ కోర్స చంద్రలేఖ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ములకలపల్లిలో వెలసిన శివాలయం రోజురోజుకీ అభివృద్ధి చెందుతూ భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొన యాడపడుతుందన్నారు.

శివాలయంలో 15వ తేదీ రాత్రి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ నరాటి ప్రసాద్ తెలిపారు. కళ్యాణ మహోత్సవంకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పువ్వాల లలితారావు,  మాజీ జెడ్పిటిసి బత్తుల అంజి, ఆలయ కమిటీ సభ్యులు బండి కొమురయ్య, శనగపాటి సీతారాములు,కొదుమూరి వీరగోపాల్, బిక్కమల్ల వేణుగోపాల్, శనగపటి రవి,అత్యం రాంబాబు, పద్ధం నరసింహారావు,కొదుమూరి మధు,లంక రాము తదితరులు పాల్గొన్నారు.