12 July, 2026 | 2:24 AM

ఘనంగా కేంద్ర మంత్రి జన్మదిన వేడుకలు

12-07-2026 12:00 AM

బండి సంజయ్‌కి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

కరీంనగర్, జూలై 11 (విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాక్రిష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులుసహా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, వివిధ రాష్ట్రాల నేతలు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం బండి సంజయ్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్ ముఖ్యమంత్రులు ఎ.రేవంత్ రెడ్డి, దేవేంద్ర ఫడ్నవీస్, సామ్రాట్ చౌదరి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జైశంకర్, శివరాజ్ సింగ్ చౌహాన్, జి.కిషన్ రెడ్డి, శ్రీపాద్ వై నాయక్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా,ప్రమోద్ సావంత్, మోహన్ యాదవ్, బీజేపీ తెలంగాణ ఇంఛార్జీలు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దంపతులు తదితరులు బండి సంజయ్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.

బండి సంజయ్ బర్త్ డేను పురస్కరించుకుని తెలంగాణవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.అనేక  సేవా కార్యక్రమాలు నిర్వహించారు. యజ్ఝాలు, యాగాలు చేశారు. వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రత్యేకంగా కోడె మొక్కు చెల్లించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తమిళనాడులోని తుత్తుకూడు జిల్లా తిరుచందూర్ లో ప్రసిద్ది చెందిన మురుగన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం కేరళలోని పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.