పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కొత్తపల్లి, మే 5 (విజయక్రాంతి) : ప్రధానమంత్రి నరేంద్రమోదీ “ఫిట్ ఇండియా’ నినాదాన్ని పురష్కరించుకుని కరీంనగర్ ప్రజలకు ఓపెన్ జిమ్ లు అందుబాటులోకి తీసుకురాగ, దాదాపు కోటి రూపాయల వ్యయంతో 17 డివిజన్లలో ఓపెన్ జిమ్ లను ఏర్పాటవుతున్నాయి. నాల్కో సంస్థ అందిస్తున్న సీఎస్సార్ నిధుల సహకారంతో మలయప్ప ఫౌండేషన్ నిర్వాహకులు ఈ ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేస్తున్నరు.
అందులో భాగంగా మంగళవారం రోజున కరీంనగర్ నగరంలోని కిసాన్ నగర్ అంబేద్కర్ యూత్ క్లబ్ సమీపంలో, దుర్శేడులో నూతనంగా ఏర్పాటు చేసిన రెండు ఓపెన్ జిమ్ లను కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఆయా ఓపెన్ జిమ్ లను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు.
కేంద్ర మంత్రి సహకారంతో పూర్తిగా ప్రైవేట్ సంస్థలు అందిస్తున్న సీఎస్సార్ నిధులతోనే ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేసినట్లు మలయప్ప ఫౌండేషన్ డైరెక్టర్లు డాక్టర్ గడ్డం అరుంజయ్, గడ్డం అనూష తెలిపారు. నిత్యం ఉరుకులు పరుగులతో ఉద్యోగాల్లో బిజీగా ఉంటూ శారీరక ఫిట్ నెస్ ను కోల్పోతున్న వారికి ఈ ఓపెన్ జిమ్ లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
కరీంనగరలో మొత్తం 17 డివిజన్లలో వీటిని ఏర్పాటు చేస్తున్నమని కరీంనగర్ ప్రజలంతా ఈ ఓపెన్ జిమ్ లను ఉపయోగించుకుని శారీరక ధ్రుఢత్వాన్ని పెంచుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. అంతకుముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కొత్తపల్లి మండలంలోని కమాన్ పూర్ గ్రామంలో రూ.20 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద గత ఆరేళ్లుగా వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు చెప్పారు. ఈ సారి సైతం తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిధులు మంజూరయ్యాయని, వాటితో సీసీ రోడ్లతోపాటు ఇతర అభివ్రుద్ధి పనులకు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నునుగొండ మానస-ప్రవీణ్, ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.






