ఎప్పుడు ఎన్నికలు జరిగిన.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మజ్లిస్ బెదిరిస్తోంది:
భాగ్యలక్ష్మి ఆలయాన్ని స్వర్ణదేవాలయం వలే నిర్మిస్తాం
హైదరాబాద్: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం(Charminar Bhagyalakshmi Temple) శక్తివంతమైన ప్రదేశమని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay) అన్నారు. అమ్మ ఆశీర్వాదం వల్లే ఎన్ని కష్టాలు వచ్చినా తాను ఎదుర్కుంటున్నానని తెలిపారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి ఆలయాన్ని స్వర్ణ దేవాలయం వలే నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
మోదీ పాలనలో భారత్.. హిందువులకు సురక్షిత దేశంగా మారిందన్నారు. ఇవాళ ఇతర దేశాల్లోని హిందువులు భారత్ కు వస్తున్నారని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని(Congress Government) మజ్లిస్ పార్టీ బెదిరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో హిందువులకు, ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.




