24 April, 2026 | 12:45 PM

Breaking News

BJP కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి?   •   అడవికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు   •   కోనరావుపేటలో ఘనంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్ 2వ వార్షికోత్సవం – గ్రాడ్యుయేషన్ డే వేడుకలు   •   కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?   •   సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •   అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం   •   చర్చలు ప్రారంభం.. హామీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్   •   ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు: RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మహేష్ గౌడ్ దిగ్భ్రాంతి   •  

కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?

24-04-2026 11:52 AM
  1. కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు
  2. ఆర్టీసీ కార్మికులకు BJP అండగా ఉంటుంది
  3. కమిటీల పేరుతో సర్కార్ కాలయాపన
  4. కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దు .. కోట్లాడాలి
  5. బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కనే కాంగ్రెస్ తీరు

హైదరాబాద్: వరంగల్ నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిపట్లు కేంద్రమంత్రి బండిసంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay) దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాన్నికి చిత్తశుద్ధి లేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు దుర్భర జీవితం గడుపుతున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. RTCని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.

అభయహస్తం పేరుతో మేనిఫెస్టో విడుదల చేశారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) వచ్చి 900 రోజులైనా.. హామీల అమలు ఏమైంది? అని ప్రశ్నించారు. 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించారని ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికులు సంయమనం కోల్పోవద్దని కోరారు. కమిటీల పేరుతో రేవంత్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు.

ఢిల్లీకి మూటలు అప్పగించేందుకు డబ్బులు దండిగా ఉన్నాయి కానీ కార్మికుల సమస్యలు పరిష్కారానికి మాత్రం డబ్బులు లేవు అని ఆయన ఫైర్ అయ్యారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు డబ్బులు తెలంగాణ నుంచే వెళ్తున్నాయని తెలిపారు. తెలంగాణ నుంచి డబ్బులు వెళ్తేగానీ కాంగ్రెస్ పార్టీ నడవదన్నారు. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. రెండు పీఆర్ సీ బకాయిలు తక్షణమే చెల్లిస్తామని హమీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కనే కాంగ్రెస్ వ్యవహారిస్తోందని ఆయన హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దన్న కేంద్రమంత్రి కోట్లాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు.