10 August, 2026 | 2:50 AM

బోనాలకు నిధులేవీ?

10-08-2026 01:25 AM

రంజాన్‌కు రూ.33 కోట్లు

లాల్‌దర్వాజా బోనాలకు రూ.5.50 లక్షలేనా? 

కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ 

లాల్‌దర్వాజా అమ్మవారికి ప్రత్యేక పూజలు

హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): రంజాన్‌కు రూ.33 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, బోనాల పండుగకు నిధుల కేటాయింపులో ఎందుకు వివక్ష చూపుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న లాల్‌దర్వాజా బోనాలకు కేవలం రూ.5.50 లక్షలు మాత్రమే కేటాయించడం ఏమిటని నిలదీశారు. సరిపడా నిధులు కేటాయించకపోవ డానికి కారణం ఏమిటని ప్రశ్నించారు.

ఆదివారం హైదరాబాద్ పాతబస్తీలోని సైదాబాద్‌లో నల్లపోచమ్మ, లాల్‌దర్వాజ  శ్రీసింహవాహిని అమ్మవారి బోనాల వేడుకల్లో మం త్రి పాల్గొన్నారు. బోనం ఎత్తుకుని సింహవామిని అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే నగరంలోని పలు ఆలయాలకు వెళ్లి పూజ లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. హిందూ సమా జం అంటే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు భయమని విమర్శించారు.

టిప్పు సుల్తాన్ దీపావళి నాడు ఆలయంలో వెయ్యి మంది మహిళలు, పిల్లలను కాల్చి చంపాడని, అ ట్లాంటి దుర్మార్గుడిని హీరోగా చిత్రీకరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆయన విగ్రహాలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అని ప్రశ్నించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల చరిత్రను ఎందుకు పాఠ్యాంశాల్లో చేర్చలేదన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలోని భాగ్యలక్ష్మీఅమ్మవారి ఆలయానికి తా ను వెళ్తే కేటీఆర్ హేళన చేశారని, ఈరోజు కేటీఆర్‌కు జ్ఞానోదయమై భాగ్యలక్ష్మీఅమ్మవారిని దర్శించుకున్నారని ఎద్దేవా చేశారు.

లాల్‌దర్వాజా ఉజ్జయి ని మహంకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధికి రూ.20 కోట్లు ఇస్తానని కేసీఆర్ మోసం చేశారన్నారు.  అందుకే ఆ పార్టీని ప్రజలు ఓడించారని విమర్శించారు. పాతబస్తీలో పన్నులు చెల్లించేది హిందువులేనని, మా పైసలు మాకు ఇవ్వడానికి ఏం నొప్పి అని మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తాను ప్రశ్నిస్తే మతతత్వవాది అని ముద్ర వేస్తున్నారని, పాతబస్తీ బరాబర్ హిందువులదేనని, హిందూ సమాజాన్ని జాగృతం చేయడమే తనకు ముఖ్యమన్నారు. 

3,400 ఆలయాలకు రూ.20 కోట్లేనా? 

హైదరాబాద్ నగరంలో 3,400 హిం దూ ఆలయాలు ఉంటే వాటికి కేవలం రూ.20 కోట్లు మాత్రమే ఇస్తారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. విదేశాల్లో నిషేధించిన తస్లీమా జమాతే సంస్థ సభకు కూడా కాంగ్రెస్ రూ.2.40 కోట్లు విడుదల చేసిందని ఆరోపించారు. ‘గోమాతను వధిస్తే ప్రశ్నించాలా.. వద్దా?, హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తే ప్రశ్నించవద్దా?, 15 నిమిషాల టైమిస్తే హిందువులను నరికి చంపుతానంటే ప్రశ్నించవద్దా?.. నేను బరాబర్ సనాతన ధర్మం కోసం పని చేస్తా’ అంటూ ఆయన స్పష్టం చేశారు.

ఎన్నికలకు, బోనాలకు సంబంధమే లేదన్నారు. బీజేపీ స్వచ్ఛంద సంస్థ కాదు, రాజకీయ పార్టీ అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోందిరాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోందని, హైడ్రా 150 పోస్టుల కోసం వచ్చిన అభ్యర్థులతో సరూర్‌నగర్ స్టేడియం నిండిపోవడమే అందుకు నిదర్శనమన్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగులకు రూ.4 వేల భృతి హామీ ఏమైందన్నా రు. రోజ్‌గార్ మేళాతో 12 లక్షల ఉద్యోగాల ను భర్తీ చేసిన ఘనత మోదీదే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

హిందువుల ఐక్యతకు ‘జెన్ జీ’లు ఉద్యమించాలి 

జెన్ జీలూ.. హిందువుల సంఘటితం కోసం ఉద్యమించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చాఉ. బీజేపీ అధికారంలోకి వస్తే పాతబస్తీలో బోనాల ఉత్సవాలను సకల సౌకర్యాలతో అంగ రంగ వైభంగా నిర్వహిస్తామన్నారు. ఊహించని విధంగా నిధులను ఖర్చు చేస్తామని, భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ మారుస్తామని స్పష్టం చేశారు.

బోనాల ఉత్సవాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని, మైనారిటీ సంతూష్టీకరణ విధానాలనే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు అవలంబిస్తున్నాయని పేర్కొన్నారు. అయోధ్య రామాల యని ర్మాణాన్ని కాంగ్రెస్ నేతలు ఎందు కు వ్యతిరేకించారని ప్రశ్నించారు.