23 March, 2026 | 3:59 AM

శృంగేరిలో కేంద్ర మంత్రి బండి సంజయ్

23-03-2026 12:00 AM

శారదా పీఠాదీశ్వర జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి

నారికేళ హవనం మహా యజ్ఞం పూర్ణాహుతిలోనూ..  

కరీంనగర్, మార్చి22 (విజయక్రాంతి): కర్ణాటకలోని శంకరాచార్య మహాసంస్థానం దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాధిపతి అనంత  భారతీ తీర్థ మహాస్వామి వారి 76వ జయంతి ఉత్సవాల్లో కేంద్ర హోం స హాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతి స్వామీ నిర్వహించిన పలు ప్రత్యేక పూజల్లో సంజ య్ కుమార్  పాల్గొని స్వామివారి తీర్థ ప్ర సాదాలు స్వీకరించారు.

పీఠాధిపతి జయంతి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో విధుశేఖర భారతి స్వామీ నిర్వహించిన సహస్ర నారికేళ హవనం మహా యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో కూడా కేంద్ర మంత్రి పాల్గొన్నారు. సహస్ర నారికేళ హవనం యజ్ఞం ప్రాసస్త్యం గురించి శృంగేరి పీఠం పూజారు లు మంత్రికి వివరించారు. విధుశేఖర భారతి స్వామీ తన స్వహస్తాలతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సహస్ర నారికేళ హవనం మహాయజ్ఞం తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం బండి సంజయ్ శృంగేరి శారదాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శృంగేరి పీఠ తెలంగాణ బాధ్యులు వ్యాసోజల రాధాకృష్ణ శర్మ కూడా పాల్గొన్నారు.