19 August, 2026 | 9:46 PM

జడ్చర్లలో గుర్తు తెలియని మృతదేహం కలకలం

19-08-2026 07:40 PM

- గుర్తింపు కోసం పోలీసుల గాలింపు

జడ్చర్ల:  పట్టణ పరిధిలోని వేంకటేశ్వర నగర్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో శుక్రవారం ఒక అపరిచిత వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో జడ్చర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వయస్సు సుమారు 25 నుండి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

మృతుడు బ్రౌన్ కలర్ ప్రింటెడ్ షర్ట్, దానిపై "అర్బన్ లైఫ్ " అని రాసి ఉంది, బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. కుడి చేతికి వెండి/స్టీల్ కడెం, మొలతాడుకు ఎరుపు, పసుపు రంగు దారాలు గుర్తులుగా ఉన్నాయి. మృతుని వివరాలు తెలియకపోవడంతో జడ్చర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యక్తికి సంబంధించిన సమాచారం తెలిసినవారు SHO 8712659314 3 SI 8712659343 3 సంప్రదించాలని పోలీసులు కోరారు.