19 August, 2026 | 10:33 PM

బైక్‌ను ఢీకొట్టిన లారీ.. యువకుడి పరిస్థితి విషమం

19-08-2026 09:22 PM

- ఒకే రోజు వేరు వేరు ప్రాంతాల్లో మూడు ప్రమాదాలు

టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండల పరిధిలో బుధవారం సాయంత్రం వరుసగా మూడు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సీతారాంపురం స్టేజీ సమీపంలో లారీ–బొలెరో వాహనాలు ఢీకొనగా, దంతలతండ సమీపంలో ఆటో–బైక్ ఢీకొన్న ఘటన జరిగింది. దాసుతండా సమీపంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న సంఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వరుస ప్రమాదాలతో వాహనదారులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదాల్లో గాయపడిన వారి వివరాలు, ప్రమాదాలకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

పోలీసులు ఘటనలపై వివరాలు సేకరిస్తున్నారు. దాస్‌తండా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చింత ప్రవీణ్‌ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బైక్‌పై వెళ్తున్న ప్రవీణ్‌ను బాడీ లారీ ఢీకొనడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని సులానగర్‌ పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.