కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టెన్త్ టాపర్ కు సైకిల్ బహుకరణ...
బాన్సువాడ, మే 21 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోనీ జడ్.పి.హెచ్.ఎస్ ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ చదువుకున్న విద్యార్థులకు టెన్త్ టాపర్ గా నిలిచిన బైరిపోతగౌడ్ కుమారి బైరి భావన 548 మార్పులు సాధించి బాన్సువాడ పట్టణ ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక సాధించిన ఈ సందర్భంగా కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సైకిల్ ను గురువారం బహుమతిగా అందజేయడం జరిగింది. సైకిల్ ను బహుకరించినందుకు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు విజయ్ కుమార్, ఉపాధ్యాయులు చంద్రమోహన్, పురుషోత్తమ్,ట్రస్ట్ బృందం,బిజెపి నాయకులు కొనాల గంగారెడ్డి,తృప్తి శివప్రసాద్, చీకట్లో రాజు,వాజ్ పాయి, తోట శంకర్,ఏముల నవీన్, ఆలపాటి హరికృష్ణ,,గోవురు రమేష్ తదితరులు పాల్గొన్నారు.






