21 May, 2026 | 3:53 PM

జైనూర్‌లో చలివేంద్రం – అంబలి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి

21-05-2026 02:55 PM

జైనూర్(విజయ క్రాంతి): మండల కేంద్రంలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కోవ లక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం, అంబలి పంపిణీ కేంద్రాన్ని  ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలకు చల్లని తాగునీరు, అంబలిని పంపిణీ చేశారు. ఎండల తీవ్రత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారి దాహార్తిని తీర్చేందుకు, ఉపశమనం కల్పించేందుకు ఫౌండేషన్ చేపట్టినట్లు  పేర్కొన్నారు.ప్రజలకు అవసరమైన సమయంలో సేవా చేయడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని, ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగుతాయని తెలిపారు.ఈకార్యక్రమంలో జైనూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు  పాల్గొన్నారు.