4 July, 2026 | 11:12 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

నిరుద్యోగులు నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

24-02-2026 12:21 AM

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా 

ఎల్బీనగర్, ఫిబ్రవరి 23 : హయత్ నగర్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఇంగ్లిష్ విభాగం, కెరీర్ గైడెన్స్ అండ్ ప్లేస్మెంట్ సెల్, తెలంగాణ స్కిల్ నాలెడ్జ్ సెంటర్  సంయుక్తం గా లక్ష్ ఫౌండేషన్ సహకారంతో ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన వారికి ఉపాధి కల్పించడా నికి జాబ్ మేళా నిర్వహించారు. విప్రో, కామె ట్, రామో జీ ఫిల్మ్ సిటీ, కామెట్ స్టాఫింగ్, జస్ట్ డయల్, నవతా, ముత్తూట్ ఫినాన్స్, హె చ్ ఆర్ స్క్వేర్, హెచ్ ఆర్ కో కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయి. వందలాది మం ది విద్యార్థులు ఇంటర్వ్యూలో అవకాశాలు పొం దారు.

రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పన కార్యాలయ అధికారి రవీందర్ మాట్లాడుతూ...  ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలను పొందడానికి విద్యార్థులు, నిరుద్యోగులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ... విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి పని సంస్కృతిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

302 మంది విద్యార్థు లు పాల్గొనగా, 100 మందికి పైగా అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. 52 మంది నియామక పత్రాలను తీసుకున్నారు. కో-ఆర్డినేటర్ డాక్టర్ డి.మక్లా, వైస్ ప్రిన్సిపాల్ వి. శ్రీనివాస్ రెడ్డి, వి.ఇందిర,ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ మధు ధర్మపురి, లక్ష్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ సుమన్, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ ది. రమాదేవి, తెలంగాణ స్కిల్ నాలెడ్జ్ సెంటర్ మెంటార్ వి. నాగరాజు పాల్గొన్నారు.