హెచ్‌ఎంటీ నగర్‌లో భూగర్భ డ్రైనేజీ పనులకు శ్రీకారం
03-08-2026 03:30 PM
ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గంలోని హెచ్‌ఎంటీ నగర్ డివిజన్‌లో జాన్సన్ గ్రామర్ స్కూల్ ముందు వీధి, ఇందిరానగర్ వీధి నం.3లో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి భూమిపూజ చేసి ప్రారంభించారు. పారిశుద్ధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ఈ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సాయిజెన్ శేఖర్, డీజీఎం వేణుగోపాల్, మేనేజర్ రోహిత్, స్థానికులు పాల్గొన్నారు.






