రాజీవ్ ఎన్‌క్లేవ్–గోపాల్ రెడ్డి నగర్ సీవర్ పనులు వెంటనే ప్రారంభించాలి
– ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్,(విజయక్రాంతి): కాప్రా డివిజన్ పరిధిలోని రాజీవ్ ఎన్‌క్లేవ్, గోపాల్ రెడ్డి నగర్ ప్రాంతాల్లో రూ.1.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నూతన సీవర్ పైప్‌లైన్ పనులను ఎలాంటి జాప్యం లేకుండా ప్రారంభించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు.
ఈ పనులకు అవసరమైన కంట్రోల్డ్ బ్లాస్టింగ్ అనుమతులను త్వరగా మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతిను కలిశారు. పనుల సమయంలో ప్రజలకు, ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో బైరీ నవీన్ గౌడ్, స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.






