1 July, 2026 | 9:00 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య

13-03-2026 12:00 AM

నేరేడ్‌మెట్‌లో ఘటన

కుషాయిగూడ, మార్చి 12 (విజయక్రాంతి) : నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య వేధింపులు తాళలేక ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడ్మెట్ లక్ష్మీనగర్లో నివసిస్తున్న నగెల్లి శ్రీనివాస్ (41) ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతని స్వగ్రామం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్, శ్రీనివాస్ 2012లో సట్లపల్లి జ్యోతిని వివాహం చేసుకున్నాడు.

వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. భార్య గ్రూప్స్ పరీక్షలకు సిద్ధం కావడానికి శ్రీనివాస్ ప్రోత్సాహం అందించాడు. అనంతరం జ్యోతి ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఎక్సైజ్ సీఐగా నియమితురాలైంది. ఉద్యో గం వచ్చిన తర్వాత భర్తను దూరం పెట్టడమే కాకుండా, శ్రీనివాస్ కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపుల కేసు, విడాకుల కేసు కూడా నమోదు చేసినట్లు సమాచారం. దీం తో గత నాలుగు నెలలుగా శ్రీనివాస్ భార్య కు దూరంగా ఉంటున్నాడు.

కోర్టు కేసులు, భార్య వేధింపుల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస్ ‘భార్య వేధింపులు, కేసుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని సూసైడ్ నోట్ రాసి మంగళ వారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్ సోదరుడు శివకృష్ణ ఇంటికి వచ్చి చూడగా అతను మృతి చెందినట్లు గుర్తించాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సోదరుడి ఫిర్యా దు మేరకు శ్రీనివాస్ భార్య జ్యోతి సహా మరో పది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.