1 July, 2026 | 10:20 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

సివిల్ సప్లై అధికారులు దాడులు

13-03-2026 12:00 AM

32 డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లు స్వాధీనం

సికింద్రాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో గృహ వినియోగానికి ఉద్దేశించిన ఎల్పీజీ సిలిండర్లను దుకాణాల్లో అక్రమంగా ఉపయోగిస్తున్న వారిపై అధికారులు దాడులు నిర్వహించారు. గత రెండు రోజులుగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో మొత్తం 32 గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు. పార్సిగుట్ట, పద్మారావు నగర్, రెజిమెంటల్ బజార్, తుకారాం గేట్, లాలాపేట్, చిలకలగూడ తదితర ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించారు.

దుకాణాల్లో గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వం అధికారులు వెల్లడించారు. ఈ దాడులను సికిం ద్రాబాద్ అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారీ జి.వి.చాముండేశ్వరి ఆధ్వర్యంలో డీటీలు ఉత్తేజ్ సాగర్, అభిషేక్, శ్రీనివాస్,అరుణతో పాటు ఇన్స్పెక్టర్లు తనిఖీలు నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమంగా గ్యాస్ సిలిండర్లను వినియోగించే వారిపై చట్టపరమైన చర్యలుతీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తూ, అలాగే గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగించవద్దని అధికారులు సూచించారు.