26 April, 2026 | 1:52 AM

200 మిలియన్ టన్నుల మైలురాయిని చేరిన అల్ట్రాటెక్

26-04-2026 12:20 AM

ఏప్రిల్ 24, 2026: భారతదేశంలో తన స్థాపిత సిమెంట్ తయారీ సామర్థ్యం సంవత్సరానికి 200+ మిలియన్ టన్నుల మైలురాయిని అధిగమించిందని ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రధాన సిమెంట్ సంస్థ అయిన అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్, ప్రకటించింది. ఈ క్రమంలో, సంస్థ నేడు  మూడు కొత్త సిమెంట్ గ్రైండింగ్ యూనిట్లను ప్రారంభించింది. దీనితో, చైనా మినహా, విక్రయాల పరిమాణం మరియు సామర్థ్యం పరంగా అల్ట్రాటెక్ ప్రపం చంలోనే అతిపెద్ద సిమెంట్ సంస్థగా అవతరించింది.

షాజహాన్‌పూర్ (ఉత్తర ప్రదేశ్), పత్రాతు (ఝార్ఖండ్), వైజాగ్ (ఆంధ్రప్రదేశ్)లలో ఉన్న ఈ మూడు కొత్త సిమెంట్ గ్రైండిం గ్ యూనిట్లు, ఉత్తర భారతదేశంలోని శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నిర్మాణ రంగానికి, ఝార్ఖండ్ పారిశ్రామిక కేంద్రానికి, వేగంగా పట్టణీకరణ చెందుతున్న ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతానికి సేవలు అందిస్తూ, ప్రాంతీయ సరఫరాను బలో పేతం చేయడానికి వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయబడ్డాయి. 

అల్ట్రాటెక్ వృద్ధి వేగం, దాని స్థాయి వలెనే ఎంతో విశేషమైనది. 2019లో సాధించిన ఒక కీలక మైలురాయి అయిన 100+ ఎంటీపీఏ స్థాయికి చేరుకోవడానికి దీనికి 36 ఏళ్లు పట్టింది. ఆ తర్వాతి 100 ఎంటీపీఏ స్థాయిని చేరుకోవడానికి మాత్రం ఏడేళ్ల కంటే తక్కువ సమయమే పట్టింది. ఈ వృద్ధి వేగం, సంస్థ కార్యాచరణ సామర్థ్యాన్ని, భారతదేశ మౌలిక సదుపా యాల కల్పన పట్ల ఉన్న అపారమైన ఆకాంక్షను—ఈ రెండింటినీ స్పష్టంగా చాటిచెబుతోంది.

భారతదేశంలో నిర్మితమయ్యే ప్రతి మూడు ఇళ్లలో ఒకదానికి ఎన్ హెచ్ ఐఏ నిర్మించే ప్రతి ఐదు కిలోమీటర్ల కాంక్రీటు రహ దారులలో రెండింటికి, దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో రైలు మార్గాలలో ప్రతి ఐదు కిలోమీటర్లలో నాలుగింటికి అల్ట్రాటెక్ తన వంతు సహకారాన్ని అందిస్తుంది. నూతన పార్లమెంట్ భవనం (సెంట్రల్ విస్టా), ముంబై తీర రహదారి, ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే, నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, సోనామార్గ్ సొరంగం, ముంబై - అహ్మదాబాద్  హై-స్పీడ్ రైలు కారిడార్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్మాణానికి అల్ట్రాటెక్ సిమెంట్ వెన్నెముకగా నిలిచింది.